తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్​లోనూ గులాబీ జెండా ఎగరెస్తాం: మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ తాజా వార్తలు

ఎన్నిక ఏదైనా గెలుపు మాత్రం తెరాసదే అని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు​ అన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఆయన రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని కోరుకున్నానని తెలిపారు. నాగార్జున సాగర్​ ఉప ఎన్నిక‌ల్లోనూ తాము విజ‌య ప‌తాకాని ఎగుర‌వేస్తామ‌ని ధీమా వ్యక్తం చేశారు.

Minister Errabelli Dayakar visiting Yadadri Lakshmi Narasimha Swamy
ఎన్నిక ఏదైనా గెలుపు తెరాసదే: మంత్రి ఎర్రబెల్లి

By

Published : Mar 20, 2021, 7:39 PM IST

సీఎం కేసీఆర్​ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిలో నిలిచిపోయే విధంగా ప‌రిపాల‌న సాగిస్తున్నార‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. శాస‌న స‌భ‌లో ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్.. క‌రోనా క‌ష్టకాలంలోనూ అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల సంక్షేమం, అభివృద్ధికి అద్దంప‌ట్టేలా ఉంద‌ని పేర్కొన్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఆయన రాష్ట్రం సుభిక్షంగా ఉండాల‌ని కోరుకున్నానని తెలిపారు.

ఎన్నికఏదైనా గెలుపు తెరాసదే అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. యాదాద్రి ఆలయ పునర్​నిర్మాణ పనులు మరికొద్ది రోజుల్లో పూర్తవుతాయన్న ఆయన గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా సీఎం కెసీఆర్ యాదాద్రిని అద్భుత పుణ్య‌క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నార‌ని పేర్కొన్నారు. త్వరలో జరబోయే నాగార్జున సాగర్​ ఉప ఎన్నిక‌ల్లోనూ తెరాస విజ‌య ప‌తాకాని ఎగుర‌వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:మంత్రి కేటీఆర్‌ను కలిసిన గంటా శ్రీనివాసరావు

ABOUT THE AUTHOR

...view details