యావత్ దేశ ప్రజలు గర్వించేలా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం జరుగుతోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. యాదాద్రిలో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. లాక్డౌన్ కారణంగా దర్శనాలు నిలిపివేయడంతో బయటి నుంచే స్వామివారిని మొక్కుకుని వెనుదిరిగారు.
Minister errabelli: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన ఎర్రబెల్లి - మంత్రి ఎర్రెబల్లి దయాకర్ రావు యాదాద్రి పర్యటన
పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించారు. లాక్డౌన్ కారణంగా బయట నుంచే స్వామి వారిని మొక్కుకుని వెళ్లిపోయారు.
![Minister errabelli: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన ఎర్రబెల్లి Minister Errabelli dayakar rao visited yadadri laxmi narasimha swamy temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-01:24:48:1623657288-tg-nlg-81-14-yadadri-manthri-visit-av-ts10134-14062021124535-1406f-1623654935-26.jpg)
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి
సీఎం కేసీఆర్ సంకల్పానికి యాదాద్రి పునర్నిర్మాణం మంచి ఉదాహరణ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. గతంలో రాజులు ఆలయాలను నిర్మించారని పుస్తకాలలో చదువుకున్నామని, కానీ ఇప్పుడు కేసీఆర్ రూపంలో ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు.
ఇదీ చూడండి:Petrol Price: హైదరాబాద్‌లోనూ సెంచరీ దాటిన పెట్రోల్