యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో 8 వేల కుటుంబాలకు దివిస్ లాబొరేటరీస్, ఇతర దాతల ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి సరకులు అందజేశారు. త్వరలో కరోనాతో ప్రజలు కలిసి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి అన్నారు. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రజలు ఇదే విధంగా సహకారం అందించాలని అన్నారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు దరిస్తూ కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
8 వేల కుటుంబాలకు సరకులు పంపిణీ చేసిన మంత్రి - choutuppal latest news today
లాక్డౌన్ ప్రజలు జీవించేందుకు పాఠాలు నేర్పిందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో దివిస్ లాబొరేటరీస్, ఇతర దాతల ఆధ్వర్యంలో 8 వేల కుటుంబాలకు మంత్రి నిత్యావసరాలు వితరణ చేశారు.
8 వేల కుటుంబాలకు సరకులు పంపిణీ చేసిన మంత్రి
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, దివిస్ డీజీఎం సుధాకర్, పురపాలిక ఛైర్మన్ రాజు, మాజీ ఎంఎల్ఏ ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ తాడూరు వెంకట్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'భిక్షం వేయడానికి మేము నిజాం అడుగు జాడల్లో నడవట్లేదు'
TAGGED:
choutuppal latest news today