తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్​ ఉపఎన్నికలో తెరాస విజయం ఖాయం: మల్లారెడ్డి - minister chamakura mallareddy visited vemulakonda temple

యాదాద్రి భువనగిరి జిల్లాలోని వేములకొండ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి చామకూర మల్లారెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

minister mallareddy in vemulakonda
వేములకొండలో మంత్రి మల్లారెడ్డి

By

Published : Apr 8, 2021, 3:06 PM IST

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో తెరాస ఘన విజయం సాధిస్తుందని మంత్రి చామకూర మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వేములకొండ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కు తీర్చుకోవటం కోసం వేములకొండకు వచ్చినట్లు ఆయన తెలిపారు. స్వామి వారి పూజలో మంత్రితో పాటు పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తాగు, సాగునీరు, ఫ్లోరైడ్ సమస్య తీరిందని మల్లారెడ్డి స్పష్టం చేశారు. మంత్రిని కలవడానికి వలిగొండ మండల తెరాస నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

ఇదీ చదవండి:జానారెడ్డికి ఓటమి భయం పట్టుకుంది: తలసాని

ABOUT THE AUTHOR

...view details