తెలంగాణ

telangana

ETV Bharat / state

బాటపట్టిన వలసకార్మికులు.. భోజనంపెట్టి తిప్పి పంపిన డీసీపీ - డీసీపీ నారాయణ రెడ్డి వలస కార్మికులను తిప్పి పంపారు

లాక్​డౌన్​ పొడగించిన నేపథ్యంలో వలసకూలీలు కొంత మంది సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటూ కాలినడకన వెళ్తున్నారు. యాదాద్రి జిల్లా డీసీపీ నారాయణ రెడ్డి వారిని గమనించి భోజనం పెట్టించారు. ఎక్కడికి వెళ్లొద్దని తిరిగి వెనక్కు పంపించారు.

migrants sent back by the yadadri dcp narayanareddy in yadadri bhuvanagiri
బాటపట్టిన వలసకార్మికులు.. భోజనంపెట్టి తిప్పి పంపిన డీసీపీ

By

Published : Apr 17, 2020, 5:13 PM IST

లాక్​డౌన్ పొడిగించిన నేపథ్యంలో హైదరాబాద్​లో ఉన్న వలస కూలీలు కాలినడకన సొంత గ్రామాలకు బయలు దేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్​ ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన కొంత మంది కూలీలు హైదరాబాద్​ బాచుపల్లి నుంచి కాలినడక సొంతూళ్లకు బయలుదేరారు. కొద్దిదూరం ఆటోలో వెళ్లి.. ఆ తర్వాత నడుచుకుంటూ భువనగిరికి చేరుకున్నామని తెలిపారు.

పట్టణ శివారులోని బైపాస్ రోడ్డు బ్రిడ్జి కింద సేదతీరుతున్న వారిని అటుగా వెళుతున్న యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ నారాయణరెడ్డి చూసి.. కారు ఆపి పలకరించారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారందరికీ భోజనం ఏర్పాటు చేశారు. భోజన అనంతరం ప్రత్యేక వాహనంలో వారిని వెనక్కు పంపించారు.

కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని డీసీపీ అన్నారు. హైదరాబాదులో పనులు లేకపోవడం వల్ల పిల్లాపాపలతో తాము ఇంటి దారి పట్టామని వలస కూలీలు అంటున్నారు.

ఇదీ చూడండి :మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త

ABOUT THE AUTHOR

...view details