తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండ్రోజుల్లో సొంతూరికి వెళ్లేవాడు... అంతలోనే.. - వలస కార్మికుల కష్టాలు

లాక్​డౌన్ నేపథ్యంలో సొంత రాష్ట్రాలకు వెళ్లే వారి పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. వెళ్లేందుకు రవాణా లేక, ప్రైవేటు వాహనాలు కట్టించుకునే డబ్బులు లేక... నడకను ప్రారంభించి గమ్యం చేరక ముందే ప్రాణాలు వదిలేస్తున్నారు.

migrant-worker-dead-with-heart-attack-at-chotuppal
రెండ్రోజుల్లో సొంతూరికి వెళ్లేవాడు... కానీ ఈలోపే...

By

Published : May 16, 2020, 12:12 PM IST

సొంత రాష్ట్రాలకు వెళ్లాలని నడక ప్రారంభించిన వలస కార్మికులను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉంచి అధికారులు వసతి ఏర్పాటు చేశారు. రైలులో వెళ్లేందుకు ఆలస్యమవుతుందనుకున్న కొందరు మళ్లీ నడకను ప్రారంభించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయారు.

ఛత్తీస్​ఘడ్​కు చెందిన ధనిరామ్ రాజపుత్ మాత్రం అక్కడే ఉంటున్నాడు. రెండు రోజుల్లో అతను సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు టికెట్​ కూడా బుక్​ అయింది. తన ఇంటికి చేరేలోపే... ఈ రోజు ఉదయం నీళ్లు తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. గుండె పోటుతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు.

ఇవీ చూడండి:పాజిటివ్​ వ్యక్తులను కలిసిన ఎమ్మెల్యే... ఇప్పుడిదే జిల్లాలో చర్చ..!!

ABOUT THE AUTHOR

...view details