యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారంలోని ఇటుక బట్టిల్లో పని చేసే 92 మంది ఒడిశా కూలీలు కుటుంబీకులతో కాలినడకన భువనగిరి రైల్వేస్టేషన్ చేరుకున్నారు. విషయం తెలుసుకున్న భువనగిరి పట్టణ సీఐ సుధాకర్ రైల్వే స్టేషన్ చేరుకొని, వలస కార్మికులతో మాట్లాడారు.
రైల్వేస్టేషన్లో వలస కూలీల్ని తిప్పిపంపిన పోలీసులు - బొమ్మలరామారం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న వలస కూలీల్ని పోలీసులు వెనక్కి తరలించారు. వీరికి తొలుత వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం స్వస్థలాలకు తరలిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
వలస కూలీల్ని వెనక్కి తరలించిన పోలీసులు
బొమ్మలరామారం మండలంలోని చీకటిమామిడిలోని బాలాజీ పంక్షన్ హాల్‌కు వలస కూలీలను డీసీఎంలో తరలించారు. వలస కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి... తమ స్వస్థలాలకు తరలించే వరకు పంక్షన్ హాల్లోనే ఉండేలా అన్నీ సౌకర్యాలు అందిస్తామని సీఐ సుధాకర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి : కొండపోచమ్మ నిర్వాసితులకు తాత్కాలిక నివాసాలివ్వండి : హైకోర్టు