బంగ్లాదేశ్ ప్రొఫెసర్ ప్రస్తావన వాసాలమర్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్ (Cm kcr)... గ్రామసభలో పాల్గొని ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎలా మోసపోతున్నారనే అంశానికి సంబంధించి బంగ్లాదేశ్ డాకాకు చెందిన ఓ ప్రొఫెసర్ ఇతివృత్తాన్ని వాసాలమర్రి ప్రజలకు వివరించారు.
ప్రజలు చైతన్యవంతం కావాలని సూచించిన సీఎం (Cm kcr)... స్వయం ఉపాధితో నలుగురికి ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రొఫెసర్ హాష్మి... గురించి సీఎం ఏం చెప్పారో ఆయన మాటల్లోనే వినండి.
బాగుపడాలంటే ఎట్ల ఉంటందో నేను మీకు చెప్త. ఒకాయన ప్రొఫెసర్ హాష్మి. బంగ్లాదేశ్‌ల ఉంటడు. సమాజం, ప్రజల కోసం ఆలోచించే మనిషి. ఓ రోజు ఆయన ఢాకా సిటీలో ఫుట్‌పాత్ దగ్గర నిల్చొని ఉంటడు. ఐదారుగురు సభ్యులున్న ఆడవాళ్ల గ్రూప్‌ను చూస్తడు. ఆయనకు బాధ అయితది. వీళ్లు ఎవరు అనే కనుక్కొవాలనే ఆసక్తి ఏర్పడతది. వాళ్లంతా రోజు వారీ వడ్డీకి డబ్బులు తీసుకుని పనిచేసుకునేటోళ్లు. వాళ్ల కష్టాన్ని సౌఖారీ దోస్తుండనే విషయం ప్రొఫెసర్ కనిపెడ్తడు. ఆ కూలీలందరికీ ఈ ప్రొఫెసర్ తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తడు. అలా కొన్ని నెలల తర్వాత కూలీలందరినీ ప్రొఫెసర్ వాళ్ల ఇంటికి భోజనానికి పిలుస్తడు. వాళ్లందరి ముందు ఓ సంచి పెడ్తడు. అందులో రూ. 36 వేలు తీసి వాళ్లకు ఇస్తడు. ఇవి మీ డబ్బులు. మీరంతా సమానంగా తీసుకుని వ్యాపారం చేసుకోండి. మీకు వడ్డీకి ఇవ్వడం వల్ల వచ్చిన డబ్బు అంటూ వాళ్లకు చెప్తడు. మీరు ఈ డబ్బులతో మంచిగ వ్యాపారం చేసుకుని మరో నలుగురికి సహాయపడండి అని ప్రొఫెసర్ చెప్తడు. అంటే కష్టపడినదాంట్లో కొంచెం పొదుపు చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు... దారిద్య్రం నుంచి బయటపడొచ్చని ప్రొఫెసర్ నిరూపిస్తడు.
-- వాసాలమర్రి గ్రామసభలో కేసీఆర్
ఇదీ చూడండి: Cm Kcr: ఏడాదిలోగా బంగారు వాసాలమర్రి కావాలి..