తెలంగాణ

telangana

ETV Bharat / state

గుండాలలో మెగారక్తదాన శిబిరం ఏర్పాటు - red-cross day

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో మెగారక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్​ మహేందర్​రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.

mega blood donation camp in gundala
గుండాలలో మెగారక్తదాన శిబిరం ఏర్పాటు

By

Published : May 9, 2020, 10:25 AM IST

రెడ్​క్రాస్ దినోత్సవంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ ఛైర్మన్​ మహేందర్​రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెడ్​క్రాస్ జిల్లా ఛైర్మన్ డాక్టర్ జి. లక్ష్మీనర్సింహా రెడ్డి హాజరయ్యారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే యాదాద్రి రెడ్​క్రాస్ శాఖ రక్త సేకరణలో ముందంజలో ఉందని లక్ష్మీనర్సింహారెడ్డి తెలిపారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన ప్రతీసారి విజయవంతం చేస్తున్న రక్త దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి:'భారత్​ బయోటెక్​'కు కరోనా నివారణ బాధ్యతలు

ABOUT THE AUTHOR

...view details