తెలంగాణ

telangana

ETV Bharat / state

మూగజీవాల ఆకలి తీర్చారు.. - lockdown in telangana

లాక్​డౌన్​ నేపథ్యంలో మూగజీవాలు ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్నాయి. యాదగిరిగుట్టపై ఉన్న వందలాది కోతులకు తినడానికి తిండిలేక అల్లాడుతున్నాయి. హైదరాబాద్​లోని కొందరు మెడికల్​ ఏజెన్సీస్​ యజమానులు కోతులకు ఆహారం అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు.

medicals agencies proprietors feeding the animals in yadagrigutta
మూగజీవాల ఆకలి తీర్చారు..

By

Published : Apr 26, 2020, 8:23 PM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నెల రోజులుగా భక్తులు లేక బోసిపోతోంది. భక్తులు లేకపోవడం వల్ల గోశాలలో ఉన్న మూగజీవాలతో పాటు గుట్టపై ఉన్న వందలాది కోతులకు తినడానికి తిండి లేక అల్లాడుతున్నాయి. భక్తులు ఉన్నప్పుడు మాత్రమే కోతులకు కొబ్బరి చిప్పలు,పండ్లు, పులిహోర, అన్నం ఇలా రోజు ఆహారం దొరికేది. కానీ ప్రస్తుతం ఆలయానికి భక్తుల దర్శనాలను రద్దు చేయడం వల్ల కోతులు ఆకలితో అలమటిస్తున్నాయి.

ఈ విషయం తెలుసుకున్న హైదరాబాద్​లోని పలువురు మెడికల్ ఏజెన్సీస్ యజమానులు ఆహారం తీసుకొచ్చి కోతుల కడుపు నింపారు. ప్రతి రోజు పలు ప్రాంతాల్లో కోతులతో పాటు మూగజీవాలకు ఆహారం అందిస్తున్నామని తెలిపారు. వారికి మూగజీవాలపై ఉన్న ప్రేమను చూసి ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.ఇలాంటి ఆపత్కాలంలో ప్రతి ఒక్కరు మూగజీవాలను ఆదుకోవాలని.. ప్రతి ప్రాణిని కాపాడాలని కోరారు.

ఇవీ చూడండి: పుచ్చతో... పుట్టెడు లాభాలు

ABOUT THE AUTHOR

...view details