యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరికి చెందిన ఓ వ్యక్తి ఒంట్లో బాగుండకపోవటంతో సోమవారం జిల్లా ఆస్పత్రికి వచ్చారు. సదరు వ్యక్తికి వైద్యులు కరోనా నిర్ధరణ పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చిందని చెప్పారు. పీపీఈ కిట్ ఇచ్చి అతన్ని వదిలించుకొన్నారు. కరోనా రావటంతో ఆస్పత్రి ఆవరణలోని బెంచీపైనే బాధితుడు ఐదు గంటల పాటు ఉన్నా.. ఎవరూ పట్టించుకోలేదు.
పాజిటివ్ వస్తే ఐదు గంటల పాటు బెంచీ పైనే..! - corona in yadadri bhuvanagiri district
కరోనా వచ్చిన రోగులకు మంచి వైద్యం అందిస్తున్నామంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో సిబ్బంది మాత్రం కొవిడ్ బాధితుల పట్ల నిర్లక్ష్యం వీడటంలేదు. వైరస్ నిర్ధరణ అయిన వ్యక్తిని వైద్య సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
![పాజిటివ్ వస్తే ఐదు గంటల పాటు బెంచీ పైనే..! Medical staff negligence on corona patient in yadadri bhuvanagiri district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8198318-thumbnail-3x2-corona.jpg)
ఐదు గంటల పాటు బెంచీపైనే కూర్చున్నాడు
విషయం తెలుసుకొని ఆస్పత్రికి చేరుకున్న బాధితుడి కూతురు.. తండ్రి పరిస్థితి చూసి చలించిపోయారు. వైద్యులను అడిగితే పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా రోగి పరిస్థితి చూసిన విలేకర్లు వీడియోలు తీస్తుండటంతో, చూసిన వైద్యులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బాధితుడిని వెంటనే 108 వాహనంలో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి తరలించారు.
ఐదు గంటల పాటు బెంచీపైనే కూర్చున్నాడు
ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'