తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిసరాలను శుభ్రపరిచిన వైద్యాధికారి చైతన్య కుమార్ - పరిసరాలను శుభ్రపరిచిన వైద్యాధికారి చైతన్య కుమార్

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి చైతన్య కుమార్ ఆధ్వర్యంలో డ్రై డేను పురస్కరించుకొని పట్టణంలోని పలు వీధులను శుభ్రపరిచారు.

surroundings cleaned in mothkuru
పరిసరాలను శుభ్రపరిచిన వైద్యాధికారి చైతన్య కుమార్

By

Published : Aug 8, 2020, 1:55 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో డ్రై డేను పురస్కరించుకొని పట్టణంలోని అంగడి బజార్​లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి చైతన్య కుమార్ హాజరయ్యారు. అందులో భాగంగానే దోమలకు నివాసంగా మారుతున్న మురుగు నీటిని తొలగించారు.

డ్రమ్ములు, నీటి తొట్టెల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించుకోవాలని ఇంటింటికీ తిరిగి సూచించారు వైద్యాధికారి చైతన్య కుమార్. ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ కృష్ణ, సైదమ్మ, రమణమ్మ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి:తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా కేసులు, 14 మరణాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details