తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో కట్టడాల విస్తరణకు చర్యలు - Yadadri temple updates

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్ర అభివృద్ధికి చేపట్టిన విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇందుకు యాడా చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు పనులకు శ్రీకారం చుట్టారు.

yadadri
yadadri

By

Published : Apr 29, 2021, 7:42 PM IST

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి పుణ్యక్షేత్ర అభివృద్ధికి చేపట్టిన విస్తరణకు యాడా చర్యలు తీసుకుంటోంది. ఆలయ విష్ణు పుష్కరిని వెడల్పు చేయాలని గత పర్యటనలో సీఎం కేసీఆర్ చేసిన సూచనలతో పనులకు శ్రీకారం చుట్టారు. ఆలయ ఉత్సవాలకు వినియోగించేందుకు ఈ పుష్కరిని తీర్చిదిద్దారు. చుట్టూ భక్తులు కూర్చుని వేడుకను తిలకించేలా మెట్లను పనులను చేపడతామని అధికారులు చెబుతున్నారు.

ఇందుకు తూర్పు దిశలో గోడను తొలగించారు. దైవ దర్శనం కోసం వేచి ఉండే భక్తజనుల కోసం నిర్మించిన కాంప్లెక్స్ ను విస్తరించే పనులు వేగవంతం చేశారు. ఆ సముదాయాన్ని ఆధ్యాత్మికంగా రూపొందిస్తున్నారు. వాస్తురీత్యా భవన సముదాయాన్ని విస్తరించాలని సీఎం ఏం చేసినా దిశానిర్దేశంతో ఆ పనులు ముమ్మరమయ్యాయి. పుష్కరిని వద్ద రక్షణ పనులు వేగవంతం చేశారు. రక్షణ గోడను విస్తరించి మట్టితో నింపి చదును పనులు చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details