కరోనా వైరస్ను నియంత్రించేందుకు ప్రభుత్వ అధికారులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. మాస్కులు, శానిటైజర్స్ ఇచ్చి అవగాహన కల్పిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో పదో తరగతి విద్యార్థులకు జిల్లా షెడ్యూల్డు కులాల సంక్షేమ అధికారి జె. సదన్ కుమార్ అవగాహన కల్పించారు.
పదో తరగతి విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్ల పంపిణీ
యాదాద్రి జిల్లా మోత్కూరులోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని జిల్లా షెడ్యూల్డు కులాల సంక్షేమ అధికారి జె. సదన్ కుమార్ సందర్శించారు. కరోనా వైరస్ నియంత్రణపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్స్ అందజేశారు.
పదో తరగతి విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్సు పంపిణీ
కరోనా వైరస్ సోకకుండా విద్యార్థులకు మాస్కులు, డెటాల్ సబ్బులు, చేతులు కడుక్కునే లిక్విడ్స్, చేతి రుమాళ్లను సజన్ కుమార్ అందజేశారు. కొవిడ్-19 బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.
ఇదీ చూడండి:భద్రాద్రి రామయ్యపై కరోనా ప్రభావం.. భక్తులు లేకుండానే కల్యాణం