యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాల్ పూర్ గ్రామానికి చెందిన చిలుక లావణ్య(35) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
వివరాలిలా...
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గోపాల్ పూర్ గ్రామానికి చెందిన చిలుక లావణ్య(35) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
వివరాలిలా...
తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ... తన కూతురు బలవన్మరణానికి పాల్పడినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
5 సంవత్సరాల నుంచి కడుపు నొప్పి, తలనొప్పి లాంటి సమస్యల వల్లే... వ్యవసాయ పొలంలో వేయడానికి తెచ్చుకున్న పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వెంటనే భువనగిరి ఏరియా ఆసుపత్రికి తీసుకుని వెళ్లామని చెబుతున్నారు. అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా... చికిత్స పొందుతూ మృతి చెందిందని వెల్లడించారు.