యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ ఆదివారం కావటం వల్ల కుటుంబ సమేతంగా తరలివచ్చి యాదగిరీశున్ని దర్శించుకున్నారు. కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూ ప్రసాద కౌంటర్లు, సత్య నారాయణ వ్రత పూజల వద్ద ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. స్వామివారి ధర్మదర్శనానికి దాదాపు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం వరకు పట్టింది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు.
యాదగిరీశుని దర్శనానికి పోటెత్తిన భక్తజనం - many devotees visited yadadri today
యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ సెలవురోజు అయినందున భక్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

యాదగిరీశుని దర్శనానికి పోటెత్తిన భక్తజనం