యాదాద్రి భువనగిరి జిల్లాలోని లక్ష్మీనరసింహస్వామిని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సతీసమేతంగా దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కొండ పైన జరుగుతున్న పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించారు. పురాతన కట్టడాలను ఈ కాలంలో కట్టవచ్చా అని అందర్ని ఆశ్చర్యచకితుల్ని చేసేలా నిర్మాణ పనులు సాగుతున్నాయని నిరంజన్‌రెడ్డి తెలిపారు. యావత్ భారతదేశం యాదాద్రి వైపు చూసే విధంగా అద్భుత శిల్పకళా వైభవంతో ముస్తాబవుతోందన్నారు.
యాదాద్రి సన్నిధిలో మంత్రి నిరంజన్‌రెడ్డి
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.
యాదాద్రిలో మంత్రి నిరంజన్‌రెడ్డి