యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యాదాద్రి జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి హాజరయ్యారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బంది కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
'తాగునీటి సమస్య తక్షణమే పరిష్కరించాలి' - యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి
ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బంది కలగకుండా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆలేరులో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
గ్రామాల్లో మంచి నీళ్లు రావడం లేదని సర్పంచులు అధికారులను నిలదీశారు. వేసవిలో మంచినీరు లంభించక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు వెల్లడించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని.. మిషన్ భగీరథ పనులు ఆలస్యం చెయ్యవద్దని జడ్పీ ఛైర్మన్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ మాజీ ఎమ్మెల్యే నగేశ్, ఎంపీపీ గంధమళ్ల అశోక్, మార్కెట్ ఛైర్మన్ శ్రీనివాస్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్ మల్లేశం, ఆలేరు ఎంపీడీవో, ఎమ్మార్వో, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:డ్రైవర్‌కు కరోనా... హోం క్వారంటైన్లో జీహెచ్ఎంసీ మేయర్ కుటుంబం