తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆరోగ్యశ్రీని.. శోభన్​ ఆరోగ్యశ్రీగా నామకరణం చేయండి' - aarogyasri varostav celebrations at yadagirigutta

కరోనా చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకంలో ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్​ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. యాదగిరి గుట్ట పట్టణ కేంద్రంలో నిర్వహించిన ఆరోగ్యశ్రీ సాధన వారోత్సవాలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

manda krishna participated aarogyasri sadaka varostav celebrations at yadagirigutta in yadadri bhuvanagiri district
'కరోనా చికిత్సను చేర్చి.. శోభన్​ ఆరోగ్యశ్రీగా నామకరణం చేయండి'

By

Published : Aug 8, 2020, 9:43 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిన రోజు కావడం వల్ల ఎమ్మార్పీఎస్​ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆరోగ్య శ్రీ సాధన వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్​ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ అప్పట్లో ఆరోగ్యశ్రీ కోసం ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్న ఆయన.. ఇప్పుడు కొవిడ్​ చికిత్సను ఆరోగ్య శ్రీ పథకంలో పెట్టాలని కోరారు.

దీని కోసం ఎమ్మార్పీఎస్ ద్వారా పోరాటం చేస్తామని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొవిడ్​ చికిత్సలు చెయొద్దని చెప్పిన కేసీఆర్​.. ఎమ్మెల్యేలకు పాజిటివ్​ రాగానే ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం సరికాదని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీ రావడానికి గల కారణం అయిన శోభన్ అనే వ్యక్తి పేరుమీదుగా శోభన్ ఆరోగ్య శ్రీ నామకరణం చేయాలన్నారు.

ఇవీచూడండి:భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details