తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ - sithara wines latest News

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సితార వైన్స్ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద ఉన్న బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

By

Published : Aug 2, 2020, 2:45 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని సితార వైన్స్ నుంచి అక్రమంగా బెల్డ్ షాపునకు మద్యం తరలిస్తున్న వ్యక్తిని పట్టణ పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుడు బీబీనగర్ మండలం ముగ్దుంపల్లికి చెందిన సత్తయ్యగా గుర్తించారు. సదరు వ్యక్తి నుంచి 120 కింగ్ ఫిషర్ బీర్ బాటిళ్లు, 96 ఐబీ క్వార్టర్ సీసాలు, 24 ఓసీ హాఫ్ బాటిళ్లు , 48 ఓసీ క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.47,520 ఉంటుందని పట్టణ సీఐ సుధాకర్ వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details