యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.ఇందుకు వాసాలమర్రి గ్రామ రైతులను నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ పర్యటనకు తీసుకువెళ్లాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం బుధవారం ఉదయం తొమ్మిది ఆర్టీసీ బస్సుల్లో రైతులను తీసుకువెళ్లారు.
వాసాలమర్రి గ్రామ రైతుల అంకాపూర్ పర్యటన - నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. వాసాలమర్రి గ్రామ రైతులను నిజామాబాద్ జిల్లాలోని అంకాపూర్ పర్యటనకు తీసుకువెళ్లాలని ఆదేశించడంతో అధికారులు వారిని ఆర్టీసీ బస్సుల్లో బుధవారం తీసుకువెళ్లారు.
![వాసాలమర్రి గ్రామ రైతుల అంకాపూర్ పర్యటన Ankapur visit of Vasalamarri village farmers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9581076-76-9581076-1605696897479.jpg)
వాసాలమర్రి గ్రామ రైతుల అంకాపూర్ పర్యటన
ఒక్కో బస్సుల్లో 30 మంది రైతులను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా రైతులను అంకాపూర్ పర్యటనకు తీసుకువెళ్లారు. వారితో పాటుగా గ్రామ ప్రజా ప్రతినిధులు కూడా వెళ్లారు. పర్యటనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. అంకాపూర్ రైతులు పంట సాగులో, విత్తన తయారీలో ఎలాంటి విధానం అవలంబిస్తున్నారనే విషయంపై వీరికి అవగాహన కల్పించనున్నారు.
ఇవీ చదవండి: 'వరదసాయం పేరుతో... ప్రభుత్వం ప్రజలను వేధిస్తోంది'