తెలంగాణ

telangana

ETV Bharat / state

భువనగిరికి చెందిన మహిళ అదృశ్యం

బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరిన మహిళ అదృశ్యమైన ఘటన భువనరిగిరి పట్టణంలో చోటుచేసుకుంది. సదరు మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భువనగిరికి చెందిన మహిళ అదృశ్యం

By

Published : Apr 20, 2019, 9:16 AM IST

భువనగిరికి చెందిన మహిళ అదృశ్యం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని కామునికంత కాలనీకి చెందిన కడారి పద్మ గురువారం అదృశ్యమైంది. హైదరాబాద్ బోడుప్పల్​లోని తన చెల్లెలి ఇంటికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి బయలుదేరింది. గురువారం రాత్రి వరకూ బోడుప్పల్ చేరుకోకపోవటం వల్ల కుటుంబ సభ్యులు... బంధువుల ఇళ్లలో వాకబు చేశారు . అయినా పద్మ ఆచూకీ దొరకలేదు. శుక్రవారం భువనగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అంజయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details