యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్ర సన్నిధిలో స్వస్తివాచనంతో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 23 వరకు ఈ వేడుకలు వైభవంగా జరగనున్నాయి.
యాదాద్రిలో మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
యాదాద్రిలో నేటి నుంచి మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు స్వస్తివాచనంతో ఆరంభం కాగా.. ఈ నెల 23న మహా పూర్ణాహుతితో ముగియనున్నాయి.
యాదాద్రిలో మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈనెల 19న జారోహణం, భేరిపూజ, దేవతాహ్వానం, అగ్ని ప్రతిష్ఠ నిర్వహించనుండగా.. 20న ఉదయం రుద్రహావనము, సాయంకాలం రామలింగేశ్వర స్వామి వారి కల్యాణ జరిపించనున్నార. అలాగే 21న మహాశివరాత్రి సందర్భంగా అభిషేకాలు, సాయంకాలం మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం చేస్తారు. 22న లక్ష బిల్వార్చన, సాయంకాలం రథోత్సవం, 23న మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి.
ఇవీ చూడండి:రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ