యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్ర సన్నిధిలో స్వస్తివాచనంతో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 13 వరకు ఈ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. 10న స్వామి వారికి కల్యాణం నిర్వహించనున్నారు.
యాదాద్రిలో ప్రారంభమైన మహా శివరాత్రి ఉత్సవాలు - Maha Shivaratri celebrations started in Yadadri
యాదాద్రిలో నేటి నుంచి మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వస్తివాచనంతో ఉత్సవాలు ఆరంభం కాగా.. ఈ నెల 13 వరకు ఘనంగా వేడుకలు జరగనున్నాయి.
యాదాద్రిలో ప్రారంభమైన మహా శివరాత్రి ఉత్సవాలు
శ్రీ రామలింగేశ్వర స్వామి వారి బాలాలయంలో ధ్వజపటారోహణ, బేరిపూజ, అగ్ని ప్రతిష్ఠ పూజ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమాల్లో ఆలయ ఈవో ఎన్.గీతారెడ్డి, ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణి నరసింహ మూర్తి పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఉత్తరాఖండ్ సీఎం రావత్ రాజీనామా