ఆకాశంలో విచిత్రమైన, అద్భుతమైన సంఘటన చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్టలో.. శనివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు సూర్యుని చుట్టూ అద్బుతమైన వలయం కనబడింది. గ్రహణమా..? ఇంద్రధనస్సా..? అనేది కాసేపు ఎవరికి అర్థం కాలేదు.
ఆకాశంలో అద్భుతం.. భానుడి చుట్టూ వలయాకారం
యాదాద్రిలో ఆకాశంలో వింత సంఘటన చోటుచేసుకుంది. భగభగ మండే భానుడి చుట్టూ అద్భుతమైన వలయాకారం ఏర్పడింది. అది క్రమంగా పెరుగుతూ వచ్చి తర్వాత కనిపించకుండా పోయింది. ఆ వలయాకారం దాదాపు రెండు గంటల వరకు సూర్యుని చుట్టూ ఉంది. దీనిని ఒక వింతలా ప్రజలందరూ ఆసక్తిగా తిలకించారు.
ఆకాశంలో అద్భుతం.. భానుడి చుట్టూ వలయాకారం
సూర్యునికి గ్రహణం పడుతున్నటుగా.. భానుడి చుట్టూ వలయం ఏర్పడింది. మొదట సూర్యుని చుట్టూ చిన్న వలయాకారంలో ఉండి క్రమంగా పెరుగుతూ పెద్ద వృత్తంలాగా ఏర్పడి కనిపించకుండా పోయింది. ఈ వింతను చూసి ప్రజలు వారి చరవాణిల్లో బంధించారు.
ఇదీ చూడండి:జులై వరకు మిడతల ముప్పు తప్పదు!