యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో విధినిర్వహణలో ఉన్న పోలీసులకు స్థానిక తిరుమల వేబ్రిడ్జి యాజమాన్యం మధ్యాహ్న భోజనం సమకూర్చారు. కొవిడ్ కట్టడిలో పోలీసులు శ్రమకు వెలకట్టలేమని వేబ్రిడ్జి యజమానులు అశోక్, సతీశ్ పేర్కొన్నారు.
'కొవిడ్ కట్టడిలో వారి శ్రమకు వెలకట్టలేం' - పోలీసులకు మధ్యాహ్న భోజన వసతి
కొవిడ్ కట్టడికి అలుపెరగక శ్రమిస్తున్న పోలీసుల శ్రమకు వెలకట్టలేమని పలువురు పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో స్థానిక తిరుమల వేబిడ్జి యాజమాన్యం విధినిర్వహణలో ఉన్న పోలీసులకు మధ్యాహ్న భోజనం సమకూర్చారు.
మోత్కూరు వార్తలు
అందరూ ఇంట్లోనే ఉండాలని సూచిస్తూ... రోడ్లపై పహారా కాస్తున్న వారి సేవలు మరచిపోరాదని అన్నారు. ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా కష్టకాలంలో ఇతరులకు సాయం చేయాలని.. కొవిడ్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై ఉదయ్ కిరణ్, ఏఎస్సై ప్రకాశ్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కొవిడ్ నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్