భువనగిరి ఖిల్లాపై ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేరుకు చెందిన కోడూరి నవీన్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కొమురవెల్లి మండలం వేచరేనికి చెందిన యువతి ఇంటర్ చదువుతోంది. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకోగా.. తమ తల్లిదండ్రులు ఒప్పుకోరనే భయంతో శనివారం ఉదయం ఇంటి నుంచి పారిపోయారు.
భువనగిరి ఖిల్లా సాక్షిగా... ప్రేమజంట ఆత్మహత్యాయత్నం - LOVERS SUICIDE NEWS IN TELANGANA
తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరిస్తారో లేదో అన్న భయంతో ఆత్మహత్యకు యత్నించింది ఓ ప్రేమ జంట. స్నేహితులకు చివరిసారి ఫోన్ చేసి భువనగిరి ఖిల్లా సాక్షిగా తాము తనువు చాలిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు.
LOVERS SUICIDE AT BHUVANAGIRI FORT
భువనగిరికి వచ్చిన ప్రేమికుల జంట... ఈరోజు ఉదయం ఖిల్లాపై విషం తాగారు. పట్టణంలో ఉంటున్న స్నేహితులకు ఫోన్ చేసి విషయం తెలిపాడు నవీన్. ఆందోళన చెందిన స్నేహితులు వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.... బాధితులను ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల... హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.