యాదాద్రి పుణ్యక్షేత్రంలో శైవభక్తుల కోసం చేపట్టిన శివాలయ పునర్నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. 2017 లో జూన్ 19న శివాలయ పునర్నిర్మాణానికి శ్రీకారం జరిగింది.
యాదాద్రిలో తుదిదశకు శివాలయ పునర్నిర్మాణం - yadadri temple reconstruction
తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన యాదాద్రి పుణ్యక్షేత్రంలో వైష్ణవ భక్తులకే కాకుండా శైవభక్తులు ఆరాధించే శ్రీ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం చివరి దశకు చేరింది. శైవ సంప్రదాయ హంగులతో శివాలయాన్ని ముప్పావు ఎకరంలో తీర్చిదిద్దుతున్నారు.
యాదాద్రిలో శైవహంగులతో శివాలయ పునర్నిర్మాణం
పనులు పూర్తవ్వడానికి మూడున్నర ఏళ్లు పట్టిందని స్థపతి డాక్టర్ఆనందారి వేలు తెలిపారు. ఉప ఆలయాలు, నవగ్రహ మండపం, కల్యాణ మండపంతోపాటు నంది విగ్రహాలతో ప్రహరీ నిర్మించినట్లు వెల్లడించారు.
- ఇదీ చూడండి :తిరుమల నుంచి వస్తుండగా వెంటాడిన మృత్యువు