యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోందని డీసీపీ నారాయణ రెడ్డి అన్నారు. ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు తనిఖీలు చేపడుతున్నారని, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 8,500 కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. మాస్కులు లేకుండా, మాస్కులు సరిగా ధరించకుండా బయటకు వచ్చిన వారిపై 3,500 కేసులు నమోదు కాగా, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లఘించినవారిపై 3,300 కేసులు నమోదయ్యాయని తెలిపారు. భౌతిక దూరం పాటించని కేసుల కింద 1400, ప్రజలు గుమిగూడినందుకు 350 కేసులు నమోదు చేశామన్నారు.
పకడ్బందీగా లాక్డౌన్.. ఇప్పటివరకు 8,500 మందిపై కేసులు - lockdown enforcing strictly in yadadri bhuvanagiri district
యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా పోలీసులు లాక్డౌన్ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ 9 రోజుల్లో దాదాపు 8 వేలకు పైగా కేసులు నమోదు చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో లాక్డౌన్
హోటళ్ల నిర్వాహకులు వినియోగదారులకు పార్శిల్ ఇవ్వటానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని డీసీపీ సూచించారు. జిల్లా కేంద్రంలో లాక్డౌన్కు వ్యాపారులు, ప్రజలు సహకరించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.