తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి జిల్లాలో లాక్ డౌన్ అమలుకు కఠిన చర్యలు - యాదాద్రి భువనగిరి జిల్లాలో లాక్ డౌన్

యాదాద్రి భువనగిరి జిల్లాలో లాక్ డౌన్​ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. రాయగిరి-మోత్కూరు రహదారిపై ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు కఠినతరం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులకు జరిమానా విధించారు.

lock down in yadadri bhuvanagiri
జిల్లాలో లాక్ డౌన్ అమలుకు కఠిన చర్యలు

By

Published : May 23, 2021, 7:39 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో లాక్ డౌన్ అమలుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మోటకొండూరు మండల పరిధిలోని ముత్తి రెడ్డి గూడెంలోని రాయగిరి-మోత్కూరు రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ వద్ద ఎస్సై డి.నాగరాజు వాహన తనిఖీ నిర్వహించారు. అనవసరంగా బయటకు వస్తున్న వాహన దారులకు అవగహన కల్పించారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు ఫైన్​లు వేస్తున్నారు.

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప రోడ్ల మీదికి రావొద్దని సూచించారు. కరోనా పోరులో అందరూ కలిసి మహమ్మారి కట్టడికి సహరించాలని కోరారు. నిర్ణీత సమయం తర్వాత రోడ్లు మీదికి వస్తే.. ఫైన్​లతో పాటు వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: ప్రముఖ నేపథ్య గాయకుడు ఏవీఎన్​ మూర్తి మృతి

ABOUT THE AUTHOR

...view details