తెలంగాణ

telangana

అనవసరంగా బయటకు వస్తే కేసులు: డీసీపీ

By

Published : May 12, 2021, 4:16 PM IST

ఎవరైనా లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో లాక్​డౌన్​ను పర్యవేక్షించారు.

లాక్​డౌన్​, lock down
యాదాద్రి భువనగిరి జిల్లాలో లాక్​డౌన్​

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో కట్టుదిట్టంగా లాక్​డౌన్ అమలవుతోంది. డీసీపీ నారాయణ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రధాన రహదారిపై పోలీసులు విధులు నిర్వహిస్తూ ఎవరూ బయటకు రావద్దని ప్రజలకు సూచిస్తున్నారు.

అత్యవసర సమయంలో తప్ప అనవసరంగా ప్రజలు రోడ్లపైకి రావొద్దని డీసీపీ నారాయణ రెడ్డి కోరారు. జిల్లా వ్యాప్తంగా 700 మంది పోలీస్ సిబ్బంది లాక్​డౌన్​లో విధులు నిర్వర్తిస్తున్నారని వెల్లడించారు. వివాహాలకు 40 మంది. అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:పెళ్లికి వెళ్లాలి పంపించండి సార్.. సరిహద్దుల్లో తప్పని తిప్పలు.!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details