తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రి ఆలయ రాజగోపురానికి ఇరువైపులా సింహం విగ్రహాలు - యాదాద్రి ఆలయం అభివృద్ధి

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు వేగవంతగా కొనసాగుతున్నాయి. దానిలో భాగంగా... జగోపురానికి ఇరువైపులా సింహం విగ్రహాలు పొందుపరిచనున్నారు.

Lion statues on either side of the Yadagri temple Dome
యాదాద్రి ఆలయ రాజగోపురానికి ఇరువైపులా సింహం విగ్రహాలు

By

Published : Sep 19, 2020, 4:32 PM IST

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఇటీవల మహాబలిపురం నుంచి వచ్చిన సింహం విగ్రహాలను ప్రధానాలయ రాజగోపురాలకు ఇరువైపులా పొందుపరిచే పనులు వేగవంతం చేశారు. శుక్రవారం ఉత్తర రాజగోపురానికి రెండు పక్కల ఆ విగ్రహాల పొందిక పూర్తయ్యింది. ప్రధానాలయ నాలుగు రాజగోపురాలకు ఇరువైపులా ఎనిమిది సింహం విగ్రహాలు ఏర్పాటుచేస్తున్నారు. శివాలయంలో నంది విగ్రహాన్ని పీఠంపై పొందుపరిచారు. ప్రధానాలయ ముందు భాగంలో కృష్ణ శిలలతో చేస్తున్న ఫ్లోరింగ్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి.

నంది విగ్రహాలు
యాదాద్రి ఆలయ రాజగోపురానికి ఇరువైపులా సింహం విగ్రహాలు

ABOUT THE AUTHOR

...view details