యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రధాన ఆలయ గోపురాలకు విద్యుద్దీపాల ప్రయోగాత్మక పరిశీలన చేస్తున్నారు. ప్రధానాలయం లోపల ఇప్పటికే పరిశీలన ముగిసింది. ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి వైటీడీఏ అధికారులు, స్తపతుల సమక్షంలో ప్రధాన ఆలయ గోపురాలకు వివిధ రంగుల్లో దీపాలు అమరుస్తున్నారు. బంగారు వర్ణంలో వేసిన లైటింగ్‌లో గోపురాలు స్వర్ణ కాంతులీనాయి. పరిశీలన అనంతరం దీపాలను ఎంపిక చేస్తామని వైటీడీఏ అధికారులు తెలిపారు.
యాదాద్రీశుడి గోపురాలకు విద్యుత్ వెలుగులు - యాదాద్రీశుడి ఆయలానికి లైటింగ్ ట్రయల్‌రన్
యాదాద్రీశుడి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతోన్నాయి. అందులో భాగంగా ప్రధానాలయ గోపురాలకు రంగురంగుల మెరిసే విద్యుద్దీపాలను అమర్చి అధికారులు ట్రయల్‌రన్ నిర్వహించారు. దానితో స్వర్ణవర్ణ కాంతులతో శ్రీ లక్ష్మీనారసింహుడి ప్రధానాలయం మెరిసిపోయింది.
![యాదాద్రీశుడి గోపురాలకు విద్యుత్ వెలుగులు Lighting Trail Run to Yadadri Temple in Yadadri Bhuvanagiri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8254099-1050-8254099-1596262888264.jpg)
యాదాద్రీశుడి గోపురాలకు విద్యుత్ వెలుగులు
ప్రధానాలయం లోపల, ఏసీ ఎలక్ట్రికల్, పనులు పూర్తయ్యాయి. తిరుమల తరహాలో రాత్రి సమయంలో రాజగోపురాలన్ని, రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోయేలా చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగానే, యాదాద్రి ప్రధాన ఆలయ గోపురాలను విద్యుత్ దీపాలతో అలంకరించి ట్రయల్ రన్ నిర్వహించారు. వడివడిగా ఎబోజింగ్ పనులు.. అదేవిధంగా, యాదాద్రీశుడి అష్టభుజి అంతర్ ప్రాకార మండపంలో శిల్పాల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి:ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల