తెలంగాణ

telangana

ETV Bharat / state

yadadri: విష్ణు పుష్కరిణి, శివాలయానికి సరికొత్త విద్యుద్దీపాలు - తెలంగాణ వార్తలు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో సరికొత్త విద్యుద్దీపాలను అమర్చుతున్నట్లు వైటీడీఏ అధికారులు తెలిపారు. శివాలయానికి త్రిశూలం, విష్ణుపుష్కరిణికి శంకు, చక్రం ఇత్తడితో అమర్చనున్నారు. ఆలయంలో మిగతా పనులు వేగంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

yadadri temple works, lighting at sri lakshmi narasimha swamy temple
యాదాద్రి ఆలయంలో విద్యుద్దీపాలు, శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

By

Published : Jun 1, 2021, 1:13 PM IST

యాదాద్రి (yadadri) క్షేత్ర అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. విష్ణు పుష్కరిణి, శివాలయానికి సరికొత్త విద్యుద్దీపాలు అమర్చుతున్నట్లు వైటీడీఏ(ytda) అధికారులు తెలిపారు. శైవాగమ సిద్ధాంతం ప్రకారం శివాలయానికి త్రిశూలం, పాంచరాత్రాగమ సిద్ధాంతం ప్రకారం విష్ణుపుష్కరిణికి శంకు, చక్రం ఆకారాలను ఇత్తడితో అమర్చనున్నారు.

యాదాద్రి ఆలయంలో ఇత్తడి పనులు

నూతన ప్రధానాలయంలో అమర్చిన విద్యుద్దీపాల మాదిరిగానే ఉన్నప్పటికీ రెండు వైపులా వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌(CM KCR) అనుమతితో సరికొత్త విద్యుద్దీపాలను యాదాద్రికి తీసుకెళ్తున్నట్లు విద్యుత్‌శాఖ అధికారులు తెలిపారు.

ఆలయంలో సరికొత్త విద్యుద్దీపాలు

ఆలయం చుట్టూ ప్రాకార గోడలకు ఇత్తడి తొడుగు పలకలను అమర్చనున్నట్లు తెలిపారు. ఇనుప రేలింగ్ మధ్యలో వీటిని అమర్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇత్తడితో తయారు చేసిన దర్శన వరుసల క్రమం, విద్యుద్దీపాలు, రేలింగ్ మధ్యలో రానున్న పలకలతో ఆలయం ఆకర్షణీయంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.

మరింత అందం

వీటన్నింటిని సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి అనుమతితో పూర్తి చేస్తామని వివరించారు. ఆలయంలో మిగతా పనులు వేగంగా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:ప్రియురాలి కోసం పాకిస్థాన్‌కు వెళ్లిన యువకుడు.. నాలుగేళ్ల తర్వాత అప్పగింత

ABOUT THE AUTHOR

...view details