తెలంగాణ

telangana

ETV Bharat / state

దూడపై చిరుతపులి పంజా... - ఆవుపై పులి పంజా విసిరింది

పొలంలో మేస్తున్న దూడపై చిరుతపులి దాడి చేసింది. గాయాల పాలైన దూడ మరణించింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలంలో చోటు చేసుకుంది.

సంస్థాన్ నారాయణపురంలో దూడను చంపిన చిరుత
సంస్థాన్ నారాయణపురంలో దూడను చంపిన చిరుత

By

Published : Apr 2, 2020, 12:35 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో దూడపై చిరుత పులి పంజా విసిరింది. అలుగు తండాకు చెందిన మెగావత్ పంతు అనే రైతు పశువుల కొట్టంలో రాత్రి చిరుత పులి దూడపై దాడి చేసింది. ఉదయం రైతు తన పొలానికి వెళ్లి చూడగా దూడ చనిపోయి కనిపించింది. తమ సాధు జంతువు నిర్జీవం అవటం తట్టుకోలేకపోయిన రైతు దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

ABOUT THE AUTHOR

...view details