తెలంగాణ

telangana

ETV Bharat / state

Yadadri Leakage: యాదాద్రి అష్టభుజ మండప ప్రాకారాలలో లీకేజీలు - Yadadri prakaram leakage

యాదాద్రి అష్టభుజ మండప ప్రాకారంలోని స్తూపాల మధ్య నుంచి నీళ్లు కారుతున్నాయి. ప్రధానాలయంలో బయటి వైపు ఉన్న అష్టభుజ మండప ప్రాకారంలో పడమటి, ఉత్తర దిశల్లో పైనుంచి కారుతున్న వాన నీరు మొత్తం నాలుగు చోట్ల స్తూపాల మీదుగా శుక్రవారం జాలువారింది. గతేడాది అద్దాల మండపం నిర్మించిన ప్రాకారంలో నీళ్లు కారడంతో మరమ్మతులు చేపట్టారు.

Yadadri
యాదాద్రి

By

Published : Jul 24, 2021, 10:30 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యాదాద్రి క్షేత్రాభివృద్ధి పనుల తీరులో లోపలు బయట పడుతున్నాయి. ఇటీవల వరుసగా కురుస్తున్న వానలతో పునర్నిర్మితమైన పంచ నారసింహుల దేవాలయ అష్టభుజ మండప ప్రాకారంలోని స్తూపాల మధ్య నుంచి వాన నీరు కారుతోంది. ప్రధాన ఆలయానికి బయటి వైపు ఉన్న అష్టభుజ మండప ప్రాకారంలో... పడమటి, ఉత్తర దిశల్లో పైనుంచి కారుతున్న వాననీరు మొత్తం నాలుగు చోట్ల స్తూపాల మీదుగా శుక్రవారం జాలువారింది.

గతేడాది అద్దాల మండపం నిర్మించిన ప్రాకారంలో నీళ్లు కారడం వల్ల మరమ్మతులు చేపట్టారు. ఈసారి బయటి స్థూపాలపై లీకేజీలు ఏర్పడ్డాయి. ప్రాకారాల నిర్మాణ దశలో చేపట్టిన హడవుడి పనులతో వర్షాలు పడినపుడల్లా ఇలా నీళ్లు కారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ప్రాకారంలో లీకేజీ

ఇదిలా ఉండగా శివాలయంలో ఏర్పాటుకు తెచ్చిన ధ్వజ స్తంభం దూలం(కర్ర)కు పగుళ్లు వచ్చాయి. ఎలాంటి భద్రత లేకపోవడం వల్ల వానకు తడుస్తూ ఎండలో ఎండి పగుళ్లు పట్టింది. పర్యవేక్షణా లోపంతో ఇలా మారుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ధ్వజస్తంభం కర్రకు పగుళ్లు

విరిగిపడ్డ కొండచరియలు...

విరామం లేకుండా కురుస్తున్న వానలతో యాదాద్రి రెండో ఘాట్‌ రోడ్డులో గురువారం కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపైకి చేరుకునే రెండో ఘాట్ రోడ్డు మార్గమధ్యలో పక్కనగల కొండరాళ్లు కూలాయి. ఘాట్ రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బ్లాస్టింగ్ చేయడం వల్ల, వరుసగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. మొదటి ఘాట్ రోడ్డు ద్వారా భక్తులకు ఇబ్బందులు కలగకుండా వాహనాలను కొండపైకి అనుమతిస్తున్నారు.

ఇదీ చూడండి: YADADRI: యాదాద్రి రెండో ఘాట్‌ రోడ్డులో విరిగిపడిన కొండచరియలు

ABOUT THE AUTHOR

...view details