ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్లను అర్చక బృందం, వేద పండితులు సహస్రనామ, పఠనం చేయటంతో పాటు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు.
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైభవంగా లక్ష పుష్పార్చన - yadadri bhuvanagiri district latest news
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో మంగళవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష పుష్పార్చన పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. స్వామి, అమ్మవార్లకు అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు.
లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వైభవంగా లక్ష పుష్పార్చన
పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం సుమారు రెండు గంటలపాటు లక్ష పుష్పార్చన పూజ కొనసాగింది. ప్రతి శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి పర్వదినం రోజున, స్వయంభు పంచ నరసింహులు కొలువుదీరిన యాదాద్రి క్షేత్రంలో స్వామి వారికి లక్ష పుష్పాలతో అర్చకులు పూజలు జరపడం ఆలయ సాంప్రదాయం. ఈ పూజలో దేవస్థానం ప్రధాన అర్చకులు, వేదపండితులు, అర్చక బృందం పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:వేడెక్కిన దుబ్బాక ఉపఎన్నిక రాజకీయం... కొనసాగుతోన్న ఉద్రిక్తత
Last Updated : Oct 27, 2020, 5:15 PM IST