ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి సన్నిధిలో ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాలాలయ మండపంలో స్వామి అమ్మ వార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు.
యాదాద్రిలో తొలి ఏకాదశి శోభ.. ఉత్సవమూర్తులకు లక్ష పుష్పార్చన
యాదాద్రీశుని ఆలయంలో తొలిఏకాదశి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు అర్చకులు లక్షపుష్పార్చన వంటి విశేష పూజలు చేశారు. భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని లఘు దర్శనం చేసుకునే వెసులుబాటును భక్తులకు కల్పించారు.
యాదాద్రీశునికి తొలి ఏకాదశి సందర్భంగా లక్షపుష్పార్చన
లక్ష పుష్పార్చన పూజలను ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితీ అని వారు తెలిపారు. భౌతిక దూరం పాటించేలా భక్తులకు స్వామి వారిని లఘు దర్శనం చేసుకునేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి:కేబినెట్ భేటీపై నేడు నిర్ణయం.. లాక్‌డౌన్‌పై చర్చ!