యాదాద్రి పుణ్యక్షేత్రంలో నేడు ఏకాదశిని పురస్కరించుకొని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి, అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం నిర్వహించారు. బాలాలయంలో ఉదయం సుప్రభాత సేవతో మొదలైన పర్వాలు... కవచ మూర్తులను ప్రత్యేక హారతులతో కొలిచారు. మండపంలో నిజాషేకం, సుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణ పర్వాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
నారసింహునికి ఘనంగా లక్ష పుష్పార్చన - తెలంగాణ వార్తలు
నారసింహుని సన్నిధిలో లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఏకాదశిని పురస్కరించుకొని వేకువ జామునుంచే ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రకాల పూలతో స్వామి, అమ్మవార్లకు లక్ష పుష్పార్చన పూజలు జరిపారు.
లక్ష్మీనరసింహ స్వామికి లక్షపుష్పార్చన, యాదాద్రి లక్ష్మీ నరసింహ ఆలయం
వివిధ రకాల పుష్పాలతో ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు. ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. వేద మంత్రాల నడుమ సుమారు గంటపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి:మెరుగు పరిస్తే.. మరింత పర్యాటకం!