తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో లక్ష పుష్పార్చన మహోత్సవం - Yadadri district latest updates

యాదాద్రి బాలాలయంలో నిత్య ఆరాధనలు అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు, స్వర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం చేపట్టారు.

యాదాద్రిలో లక్ష పుష్పార్చన మహోత్సవం
యాదాద్రిలో లక్ష పుష్పార్చన మహోత్సవం

By

Published : Nov 11, 2020, 3:26 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో నిత్య ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఉత్సవ మూర్తులకు, స్వర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం చేపట్టారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కారించుకొని బాలాలయ మండపంలో ఉత్సవ మూర్తులకు, వివిధ రకాల రంగురంగుల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు.

సహస్రనామ పఠణాలతో, అర్చక బృందం వేద పండితులు వివిధ రకాల పూలతో సుమారు రెండు గంటల పాటు లక్ష పుష్పార్చన పూజలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, పర్యవేక్షకులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:అక్కడ 4 కి.మీ ప్రయాణం చేయాలంటే గంట సమయం

ABOUT THE AUTHOR

...view details