ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో ఇవాళ ఏకాదశి పర్వదినాన్ని నిర్వహించారు. బాలాలయ మండపంలో స్వామివార్ల ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు.
యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన - laksha pushparchana in Yadadri
యాదాద్రిలో ఇవాళ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు.
యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన
లక్ష పుష్పార్చన పూజలను ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున నిర్వహించడం ఆనవాయితిగా వస్తుందని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యల్లో పాల్గొన్నారు.
ఇవీ చూడండి:అక్కడ డబ్బులు ఉతికేస్తున్నారు