యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా శ్రీలక్ష్మినరసింహస్వామి బాలాలాయ మండపంలో ఉత్సవ మూర్తులకు వివిధ రకాల పుష్పాలతో పూజలు చేశారు.
యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన - యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో లక్ష పుష్పార్చన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
లక్ష పుష్పార్చన
ప్రతిమాసంలో శుద్ధ, బహుళ ఏకాదశి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివార్లను దర్శించుకున్నారు. నిత్య కల్యాణం, సుదర్శన హోమం, అభిషేకం, అర్చనపూజలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.