తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన - లక్ష పుష్పార్చన

ఏకాదశిని పురస్కరించుకుని యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో లక్ష పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన
యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన

By

Published : Feb 5, 2020, 3:00 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో ఏకాదశి పర్వదినాన్నీ పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. బాలాలయ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పార్చన పూజలు నిర్వహించారు.

ప్రతి మాసంలో శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి రోజున ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ పూజలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

యాదాద్రిలో వైభవంగా లక్ష పుష్పార్చన

ఇవీ చూడండి :మేడారానికి అప్పుడే భక్తుల తాకిడి.. ఆకట్టుకుంటున్న డ్రోన్​ దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details