తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదగిరీశుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ నవీన్​కుమార్ - యాదాద్రి ఆలయం వార్తలు

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయాన్ని ఎమ్మెల్సీ నవీన్​కుమార్​ దర్శించుకున్నారు. విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించారు.

kukatpally region mlc naveen kumar at yadadri temple
యాదగిరీశుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ నవీన్​కుమార్

By

Published : Oct 25, 2020, 7:51 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దసరా పండుగ పురస్కరించుకుని ప్రముఖులు దర్శించుకున్నారు. కూకట్​పల్లి, మేడ్చల్​ మల్కాజిగిరి ప్రాంత ఎమ్మెల్సీ నవీన్​కుమార్ బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

నవీన్​కుమార్​కు ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు. వారికి ఆలయ అర్చకులు స్వర్ణ పుష్పార్చన పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

ఇదీ చదవండి-రాష్ట్ర ప్రజలకు సీఎం విజయదశమి శుభాకాంక్షలు

ABOUT THE AUTHOR

...view details