యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్‌లో 50 లక్షల రూపాయల సొంత నిధులు వెచ్చించి 50 పడకల కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.
ఆ ఎమ్మెల్యే చేసిన పనికి కేటీఆర్ అభినందన - ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తాజా వార్తలు
సాధారణంగా మనం సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలంటేనే ఆలోచిస్తాం.. కానీ ఓ ఎమ్మెల్యే ఏకంగా 50 లక్షల రూపాయల సొంత నిధులను కొవిడ్ ఐసోలేషన్ కేంద్రానికి ఖర్చు చేశారు. ఆ ప్రాంతవాసుల మన్ననలే కాకుండా మంత్రి కేటీఆర్‌చే అభినందనలు పొందారు. పలువురు ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలిచారు.
50 లక్షలు ఖర్చు చేసిన ఎమ్మెల్యేకు కేటీఆర్ అభినందన
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన వార్తా కథంశాన్ని జోడించి తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఇదీ చూడండి :ప్రేమించి పెళ్లాడింది.. ఇంతలోనే ఆత్మహత్య..