తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి: కేటీఆర్ - ktr latest news

తెలంగాణ ఆచరిస్తున్న విధానాలను... ఇతర రాష్ట్రాలు అనుసరించేందుకు ముందుకు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ మండలం దండు మల్కాపూర్​లో హరిత పారిశ్రామిక పార్కును ప్రారంభించారు. గ్రీన్‌ ఇండస్ట్రియల్ పార్కులో అన్ని రకాల వసతలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభించిన కేటీఆర్

By

Published : Nov 1, 2019, 2:03 PM IST

పారిశ్రామికీకరణతో పాటు.. పర్యావరణ హితంగా రాష్ట్రాన్ని పురోగమింపజేసేందుకు కట్టుబడి ఉన్నామని పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపూర్​లో ఏర్పాటు చేసిన హరిత పారిశ్రామిక పార్కును మంత్రి ప్రారంభించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెద్ద పీట వేస్తూ.. టీఎస్​ఐఐసీ, టీఐఎఫ్​ భాగస్వామ్యంతో ఈ పార్కును నిర్మించారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న 450 ఎకరాల స్థలాన్ని 2 వేల ఎకరాలకు విస్తరించేలా పార్కును అభివృద్ధి చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. భూములిచ్చిన రైతులను ఆదుకుంటూనే.. స్థానికులకే సింహభాగం ఉద్యోగాలు దక్కేలా చూస్తామన్నారు. నలుదిశలా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నామని.. స్థానిక నిరుద్యోగ యువత అవకాశాలను అందిపుచుకునేలా ప్రభుత్వం ఏర్పాటు చేసే నైపుణ్య శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభించిన కేటీఆర్

ఇవీ చూడండి: 'మీరు కొట్లాడండి.. నన్ను ముఖ్యమంత్రిని చేయండి'

ABOUT THE AUTHOR

...view details