కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజులు చేశారు. శనివారం సాయంత్రం బాలాలయం బయట ఉట్లోత్సవం నిర్వహించి... ఆలయంలో రుక్మిణి కల్యాణం జరిపారు. పలు రకాల పూలతో స్వామి, అమ్మవార్లను అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాద్యాల నడుమ పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం, కల్యాణం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నర్సింహ మూర్తి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రీశుడి సన్నిధిలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు - తెలంగాణ తాజా వార్తలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. కొవిడ్ నిబంధనల కారణంగా భక్తులను వేడుకలకు అనుమతించకుండా పూజలు చేశారు.
![యాదాద్రీశుడి సన్నిధిలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు యాదాద్రీశుడి సన్నిధిలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8781611-584-8781611-1599937772294.jpg)
యాదాద్రీశుడి సన్నిధిలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు