తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రీశుడి సేవలో కుటుంబ సమేతంగా కూకట్​పల్లి ఎమ్మెల్యే - Kookat Palli mla Madhavaram Krishna Rao latest news

యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రీశుడిని కూకట్​పల్లి ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా దర్శించుకుని.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు.

Kookat Palli mla Madhavaram Krishna Rao visited yadadri temple
యాదాద్రీశుడి సేవలో కుటుంబ సమేతంగా కూకట్​పల్లి ఎమ్మెల్యే

By

Published : Nov 9, 2020, 2:34 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు.

వారికి ఆలయ అర్చకులు సువర్ణ పుష్పార్చన పూజలు జరిపారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదం అందచేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: చదువుకుంటూనే సేవా కార్యక్రమాలు.. రచయితగానూ గుర్తింపు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details