తెలంగాణ

telangana

కేసీఆర్​ హిట్లర్​ను మించిపోయారు: కోమటిరెడ్డి

By

Published : Oct 15, 2019, 11:54 PM IST

హుజూర్​నగర్​ ఉపఎన్నికలో గెలిచేందుకు తెరాస అడ్డదారులు తొక్కుతోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఆర్టీసీని విలీనం చేయాలని కోరితే వారిని తొలగించడం అన్యాయమన్నారు.

కేసీఆర్​ హిట్లర్​ను మించిపోయారు: కోమటిరెడ్డి

హుజూర్​నగర్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలని తెరాస దొంగ దారిలో వందల కోట్లు ఖర్చు పెడుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కేసీఆర్​ గ్రామానికో ఎమ్మెల్యే, 700 మంది ఇంఛార్జులు, 12 మంది మంత్రులను పెట్టి ఒక మహిళను ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లో సచివాలయ భవనాలను కూల్చుతామంటే హైకోర్టు చీవాట్లు పెట్టిందన్నారు. మోత్కూరు లాంటి మండల కేంద్రాలను మున్సిపాల్టీలుగా చేసి పేదవారికి పని లేకుండా చేసి వారి పొట్ట కొట్టారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన కోరికలు కోరితే వారిని తొలగించారని... ఇలాంటిది ఎక్కడ చూడలేదన్నారు. గతంలో నియంత అంటే హిట్లర్​తో పోలిస్తే... నేడు కేసీఆర్ హిట్లర్​ను మించిపోయాడని వెల్లడించారు.

కేసీఆర్​ హిట్లర్​ను మించిపోయారు: కోమటిరెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details