కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని పలు ప్రాజెక్టులపై మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఎల్‌బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు జాతీయ రహదారి అభివృద్ధి పనులకు రూ. 600కోట్లు మంజూరు చేయగా.. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి 167లో అలీనగర్ నుంచి మిర్యాలగూడ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఎన్‌హెచ్ 365లో నకిరేకల్ నుంచి తానం చెర్ల వరకు నూతనంగా రోడ్డు విస్తరణ పనులు మంజూరు అయ్యాయని.. అందులో అర్వపల్లి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వివరించారు.